రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం కేసీఆర్

  • కర్ణాటకలోని కలబురిగి వద్ద ఘోరప్రమాదం
  • గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు
  • మినీ లారీని ఢీకొట్టి అగ్నికీలల్లో చిక్కుకున్న బస్సు
  • 8 మంది హైదరాబాదీల సజీవ దహనం
గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ బస్సు కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో మినీ లారీని ఢీకొట్టి అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది హైదరాబాదీలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రమాదం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావులకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు.


More Telugu News