శాలువాలు, పుష్ప గుచ్ఛాలు తీసుకురావద్దండి!: బీజేపీ శ్రేణులకు ఎంపీ లక్ష్మణ్ అభ్యర్థన
- యూపీ కోటా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన లక్ష్మణ్
- శనివారం హైదరాబాద్ వస్తున్న బీజేపీ ఎంపీ
- తనను కలిసేందుకు వచ్చే నేతలకు లక్ష్మణ్ కీలక సూచన
యూపీ కోటా నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తాను ఈ నెల 4 (శనివారం)న హైదరాబాద్ వస్తున్నానని ఆయన తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో తనను కలిసేందుకు వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు శాలువాలు, పుష్పగుచ్ఛాలు తీసుకురావద్దని ఆయన కోరారు. ఈ మేరకు ఆంగ్లం, హిందీ, తెలుగులో ఆయన ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన లక్ష్మణ్... అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగానూ పనిచేశారు. పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని వీడకుండా నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధినాయకత్వం భావించి... యూపీ కోటా నుంచి ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో లక్నోలో శుక్రవారం డిక్లరేషన్ పత్రం అందుకున్న లక్ష్మణ్ శనివారం హైదరాబాద్ వస్తున్నారు.