కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగానే జరిగాయి: పవన్ కల్యాణ్ ఆరోపణ
- గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసన్న పవన్
- ఈ కారణంగానే ఇప్పటిదాకా పాలకులు స్పందించలేదని విమర్శ
- వైసీపీలో రెండు వర్గాల మధ్య గొడవే అల్లర్లకు కారణమన్న పవన్
కోనసీమ జిల్లా పేరు మార్పు నేపథ్యంలో జిల్లా కేంద్రం అమలాపురంలో చోటుచేసుకున్న అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం కోసం శుక్రవారం విజయవాడ వచ్చిన పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని ఆయన ఆరోపించారు.
జిల్లాల విభజనలో విరుద్ధమైన విధానంలో వైసీపీ ప్రభుత్వం ఉందని పవన్ ఆరోపించారు. అల్లర్లపై నిఘా విభాగానికి సమాచారం ఎందుకు రాలేదని ప్రశ్నించిన పవన్... గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆరోపించారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా పాలకులు అల్లర్లపై స్పందించలేదని ఆయన ధ్వజమెత్తారు. సమస్య అంబేద్కర్ పేరు కాదన్న పవన్.. ఒక పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవే అల్లర్లకు కారణమని చెప్పారు. వైసీపీలోని భిన్నాభిప్రాయాలను తొక్కి అల్లర్లను రేపారని ఆయన ఆరోపించారు.