రానా అభిమానుల్లో అదే టెన్షన్!
- నక్సలిజం నేపథ్యంలో రూపొందిన 'విరాటపర్వం'
- 1990 నేపథ్యంలో నడిచే కథ
- గ్రామీణ యువతిగా కనిపించనున్న సాయిపల్లవి
- జూన్ 17వ తేదీన ఈ సినిమా విడుదల
రానా కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందింది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, 1990ల నాటి నక్సలిజం నేపథ్యంలో నడుస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక పల్లెటూరి యువతి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది.
ఈ సినిమా విడుదలకి సిద్ధమై చాలా కాలమైంది. కొంతకాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది. జూన్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఇంతకుముందు చిరంజీవి - చరణ్ కాంబినేషన్లో వచ్చిన 'ఆచార్య' సినిమా కూడా నక్సలిజం నేపథ్యంలోనే వచ్చింది.
భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో అదే నక్సలిజం నేపథ్యంలో రానున్న 'విరాటపర్వం' ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్టు అవుతుందా? అనే టెన్షన్ తో ఉన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న రానాకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.