వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఏక‌గ్రీవ ఎన్నిక‌

  • వైసీపీ అభ్య‌ర్థులు విజ‌య‌సాయిరెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌. బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డి నామినేష‌న్లు
  • శుక్ర‌వారంతో ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గడువు
  • 4 స్థానాల‌కు న‌లుగురే బ‌రిలో ఉన్న‌ట్లు ఈసీ నిర్ధార‌ణ‌
  • ఆ న‌లుగురూ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • డిక్ల‌రేష‌న్లు అందుకున్న వైసీపీ అభ్య‌ర్థులు
ఏపీ కోటాలో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 4 రాజ్యస‌భ స్థానాల ఎన్నిక‌లు శుక్ర‌వారం పూర్తి అయ్యాయి. 4 స్థానాల‌కు కేవ‌లం 4 నామినేష‌న్లే వ‌చ్చిన నేప‌థ్యంలో... నామినేష‌న్లు వేసిన న‌లుగురు వైసీపీ అభ్య‌ర్థులు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి, ఆర్.కృష్ణ‌య్య‌, బీద మ‌స్తాన్ రావు, నిరంజ‌న్ రెడ్డిలు ఏకగ్రీవంగానే ఎన్నికైన‌ట్లు కాసేప‌టి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రిట‌ర్నింగ్ అధికారి నుంచి న‌లుగురు అభ్య‌ర్థులు తాము రాజ్య‌స‌భ‌కు ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు డిక్ల‌రేష‌న్ల‌ను అందుకున్నారు.

వాస్త‌వానికి రాజ్య‌స‌భలో ఖాళీ కానున్న స్థానాల ఎన్నిక‌లు ఇంకా పూర్తి కాలేదు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసింది. నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ గ‌డువు ముగిసేస‌రికి ఎంత‌మంది బ‌రిలో ఉంటార‌న్న దానిపై ఈసీ ఓ ప్ర‌క‌ట‌న చేస్తుంది. 

ఆ దిశ‌గానే రాజ్య‌స‌భ ఎన్నికల‌కు సంబంధించి నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసిన త‌ర్వాత ఏపీ కోటాలోని 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లు మాత్ర‌మే బ‌రిలో ఉన్న‌ట్లు తేలింది. దీంతో ఆ న‌లుగురు ఏక‌గ్రీవంగా రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన‌ట్లు ఈసీ ప్ర‌క‌టించింది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బ‌లాల ఆధారంగా నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలోనే ప‌డ‌తాయి. దీంతో వైసీపీ మిన‌హా ఏ ఒక్క పార్టీ కూడా ఈ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌లేదు.


More Telugu News