ఆర్య స‌మాజ్‌లో పెళ్లిళ్ల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

  • ప‌రువు హ‌త్య‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ 
  • పెళ్లిళ్లు చేయ‌డం ఆర్య స‌మాజ్ ప‌ని కాదన్న సుప్రీం 
  • ఆర్య స‌మాజ్ వివాహ స‌ర్టిఫికెట్ల‌ను గుర్తించ‌బోమని స్పష్టీకరణ 
ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే వివాహాలపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే పెళ్లిళ్లను, ఆ సంస్థ ఇస్తున్న స‌ర్టిఫికెట్ల‌ను గుర్తించ‌బోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయినా ఆర్య స‌మాజ్ ఉన్న‌ది పెళ్లిళ్లు చేయ‌డానికి కాద‌ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

కుల మ‌తాల‌కు అతీతంగా ప్రేమించుకున్న యువ‌త పెద్ద‌ల అంగీకారం లేక‌పోవ‌డంతో నేరుగా ఆర్య స‌మాజ్‌ను ఆశ్ర‌యిస్తోంది. అలా త‌మ వ‌ద్ద‌కు వచ్చిన యువ జంట‌ల‌కు ఆర్య స‌మాజ్ పెళ్లిళ్లు చేస్తోంది. ఇలా జ‌రిగిన పెళ్లిళ్ల‌పై ఆయా కుటుంబ పెద్ద‌లు క‌క్ష‌లు పెంచుకోవ‌డం, ప‌రువు హ‌త్య‌లు క్ర‌మంగా పెరిగిపోతున్న వైనంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను శుక్ర‌వారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా ఇక‌పై ఆర్య స‌మాజ్ ఇచ్చే వివాహ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.


More Telugu News