ప్రాణాలు కాపాడిన వైద్యులు, టెక్నీషియన్లకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృతజ్ఞతలు
- ఇటీవలే స్వల్ప గుండెపోటుకు గురైన కోటంరెడ్డి
- నెల్లూరు అపోలోలో ప్రాథమిక చికిత్స
- అనంతరం చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు
- తనకు చికిత్స అందించిన వారికి కోటంరెడ్డి కృతజ్ఞతలు
ఇటీవలే స్వల్ప గుండె పోటుకు గురైన వైసీపీ కీలక నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో తనను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు, టెక్నీషియన్లు, అంబులెన్స్ డ్రైవర్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వైద్యులు, టెక్నీషియన్లు,డ్రైవర్ ఇంటికి నేరుగా వెళ్లిన కోటంరెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.
పార్టీ కార్యక్రమంలో ఉండగానే కోటంరెడ్డి గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించగా... అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు చెన్నై అపోలో ఆసుపత్రికి రెఫర్ చేశారు. అపోలో ఆసుపత్రి అంబులెన్స్‌లోనే కోటంరెడ్డి చెన్నై చేరుకున్నారు. ఆయన వెంట నెల్లూరు అపోలో ఆసుపత్రి వైద్యుడు సుధీర్ రెడ్డి, టెక్నీషియన్ నరసయ్యలు వెళ్లారు. చెన్నైలో కోటంరెడ్డికి ప్రముఖ గుండె వైద్య నిపుణులు భక్తవత్సల్ రెడ్డి చికిత్స అందించారు. వీరందరినీ గుర్తు చేసుకున్న కోటంరెడ్డి వారి ఇళ్లకు వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు.