నడకదారిలో తిరుమల కొండెక్కిన తెలంగాణ మంత్రి హరీశ్ రావు... వీడియో ఇదిగో!
- నేడు హరీశ్ రావు పుట్టినరోజు
- గత రాత్రి అలిపిరి నుంచి పయనం
- తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్న వైనం
- ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం
ఇవాళ (జూన్ 3) తెలంగాణ మంత్రి హరీశ్ రావు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా, తన జన్మదినం సందర్భంగా హరీశ్ రావు తిరుమల విచ్చేశారు. గత రాత్రి అలిపిరి నుంచి నడకదారిలో తిరుమల కొండెక్కారు. ఈ ఉదయాన్నే వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి వెంకన్నస్వామికి మొక్కు తీర్చుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.