కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

  • కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతున్నట్టు వెల్లడి
  • మినిమం టైమ్ స్కేల్ ను అమలు చేయనున్న ప్రభుత్వం
  • పెరిగిన జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి 
కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రెసిడెన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైమ్ స్కేల్ ను అమలు చేస్తున్నామని వెల్లడించింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు సొసైటీ కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. 

మరోవైపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది. ఇంకోవైపు ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.


More Telugu News