తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌ను చెప్పిన చిన్నారి!... ఎవరీ బాలుడు అంటూ కేటీఆర్ ఆరా!

  • తెలంగాణ ఆవిర్భావంపై కుర్రాడి ప్ర‌సంగం
  • 1 నిమిషం 17 సెక‌న్ల పాటు నాన్ స్టాప్‌గా సాగిన ప్ర‌సంగం
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి బాలుడు గుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌ను చెప్పేశాడు. త‌న పేరు రాజా ప్ర‌జ్వల్ అని చెప్పిన ఆ బాలుడు తెలంగాణ ఉద్య‌మం మొద‌లైన నాటి నుంచి జ‌రిగిన ప‌రిణామాల‌ను వివ‌రించాడు. ఈ వీడియో ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ కాగా... ఆ వీడియోలోని బాలుడు ఎవ‌రంటూ కేటీఆర్ ఆరా తీశారు. 

అంద‌రికీ న‌మ‌స్కారం అంటూ మొద‌లుపెట్టిన రాజా ప్ర‌జ్వ‌ల్‌.. ఎంద‌రో చేసిన పోరాటం, మ‌రికొంద‌రి బ‌లిదానం ఫ‌లిత‌మే మ‌న తెలంగాణ రాష్ట్రం. జూన్ 2,2014 తెలంగాణ ప్ర‌జ‌లు కన్న క‌ల‌లు సాకార‌మైన రోజు.. 58 ఏళ్ల వివ‌క్ష‌కు తెర ప‌డిన రోజు.. చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు.. మ‌న తెలంగాణ రాష్ట్రం అవ‌త‌రించిన రోజు... అంటూ సాగిపోయాడు. మొత్తం 1 నిమిషం 17 సెక‌న్ల పాటు మాట్లాడిన ఆ బాలుడు.. టీఆర్ఎస్ ప్ర‌స్థానం, కేసీఆర్ ఉద్య‌మ పోరాటం, రాష్ట్రానికి తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌తలు స్వీక‌రించిన వైనం త‌దిత‌రాల‌ను నాన్ స్టాప్‌గా చెప్పేశాడు. ఆ చిన్నారి మాట‌లను మీరు కూడా కింది వీడియోలో వినండి.


More Telugu News