వివేకా హత్య కేసులో దస్తగిరి, ఇనయతుల్లాను నేడు మరోమారు ప్రశ్నించిన సీబీఐ
- ఇప్పటికే అప్రూవర్‌గా మారిన దస్తగిరి
- తొండూరు పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదు
- వివేకా హత్యతో పాటు తాజా కేసుపై ఆరా తీసిన సీబీఐ
- వివేకా ఇంటిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనయతుల్లా
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గురువారం సీబీఐ అధికారులు దస్తగిరి, ఇనయతుల్లాలను విచారించారు. కడప అతిథి గృహంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కార్యాలయానికి వీరిద్దరినీ పిలిపించిన సీబీఐ అధికారులు వారిని సుదీర్ఘంగా విచారించారు.
వివేకానందరెడ్డి కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. అదే సమయంలో జిల్లాలోని తొండూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఇటీవలే ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. వివేకా హత్యతో పాటు ఈ కేసుపైనా ఆయన నుంచి సీబీఐ అధికారులు వివరాలు రాబట్టారు. ఇక వివేకా ఇంటిలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనయతుల్లాను గతంలోనే విచారించిన సీబీఐ అధికారులు గురువారం మరోమారు విచారించారు.