అమలాపురం అల్లర్ల కేసులో 91 మంది అరెస్ట్... 8 మండలాల్లో ఇంటర్నెట్ సేవల బంద్
- గురువారం 20 మంది అరెస్ట్
- అమలాపురం సహా 8 మండలాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు
కోనసీమ జిల్లా పేరు మార్పు నేపథ్యంలో జిల్లా కేంద్రం అమలాపురంలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే 71 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా గురువారం మరో 20 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ అల్లర్లలో ఇప్పటిదాకా 91 మందిని అరెస్ట్ చేసినట్టైంది.
ఇదిలా ఉంటే... అల్లర్ల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు కొన్ని మండలాల్లో మాత్రమే పునరుద్ధరణకు నోచుకున్నాయి. అమలాపురం సహా మరో 8 మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు గురువారం ప్రకటించారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.