మోదీతో ముగిసిన జగన్ భేటీ... 45 నిమిషాల పాటు సాగిన సమావేశం
- రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ
- పెండింగ్ అంశాలను ప్రస్తావించిన జగన్
- మోదీతో భేటీ అనంతరం నిర్మలతో భేటీకి వెళ్లిన జగన్
- రాత్రి 9 గంటల తర్వాత అమిత్ షాతో భేటీకి ఛాన్స్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జగన్... సాయంత్రం 4.30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మోదీతో భేటీని ముగించుకున్న జగన్ అటు నుంచి అటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కోసం వెళ్లారు. నిర్మలతో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షా, జగన్‌ల భేటీ రాత్రి 9 గంటల తర్వాత జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.