'సర్కారువారి పాట'కి కొత్తగా జోడించిన 'మురారివా' సాంగ్!

  • క్రితం నెల 12న వచ్చిన 'సర్కారువారి పాట'
  • భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా 
  • పాటల పరంగా లభించిన మంచి మార్కులు 
  • అదనపు ఆకర్షణగా చేర్చిన 'మురారివా' పాట
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రితం నెల 12వ తేదీన విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, అదే స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టింది.

ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. సినిమా విడుదలకి ముందే ప్రతి పాట రికార్డుస్థాయి వ్యూస్ ను సంపాదించుకుంది. 'కళావతి' .. 'మ మ మహేశా' పాటలు దుమ్మురేపేశాయి. ముందుగా 'మురారివా' అనే పాటను అనుకున్నామనీ, చిత్రీకరణను కూడా పూర్తి చేశామని ప్రమోషన్స్ లో పరశురామ్ చెప్పాడు. 

ఆ తరువాత ఆ పాట కోసం అనుకున్న  ప్లేస్ లో 'మ మ మహేశా'ను సెట్ చేశామని అన్నాడు. దాంతో 'మురారివా' సాంగ్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి ఈ పాటను  జోడించారు .. అదనపు ఆకర్షణను తీసుకుని వచ్చారు. మరి ఈ పాట రిపీట్ ఆడియన్స్ ను ఎంతవరకూ థియేటర్స్ కి తీసుకుని వస్తుందో చూడాలి. 


More Telugu News