జమ్మూ కశ్మీర్ లో వరుస హత్యలు... అజిత్ ధోవల్ తో అమిత్ షా భేటీ

  • తాజాగా బ్యాంకు మేనేజర్ హత్య
  • కాల్చి చంపిన దుండగులు
  • రెండ్రోజుల కిందట స్కూలు టీచర్ ను బలిగొన్న వైనం
  • కశ్మీర్ లోయలో వ్యూహం మార్చిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉగ్రవాదులు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బ్యాంకు మేనేజర్ ను కడతేర్చారు. ఇటీవలే ఓ స్కూలు టీచర్ ను అంతమొందించారు. ఇప్పటివరకు ఈ విధంగా ఎనిమిది మందిని బలిగొన్నారు. ఈ ఘటనలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. 

ఈ ఉదయం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస సమావేశాలతో జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. 

దాదాపు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అంతమొందించే ఉగ్రవాదుల నయా వ్యూహాన్ని అడ్డుకోవడంపైనే ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఇదే అంశంపై రేపు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.


More Telugu News