వివేకా హత్యపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు హత్యతో సంబంధం ఉందన్న డీఎల్
- కోడికత్తి లాగా రాజకీయ లబ్ధి కోసం వివేకా హత్యను వినియోగించుకున్నారని ఆరోపణ
- చిన్నాన్నను చంపిన విషయం జగన్‌కు తెలుసన్న డీఎల్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని ఆయన ఆరోపించారు. కోడికత్తి మాదిరిగానే వివేకా హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని డీఎల్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు హత్యతో సంబంధం ఉందని ఆయన మరింత కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను చంపిన విషయం జగన్‌కు, వారి బంధువులకు తెలుసునని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న వైసీపీ పాలనపైనా డీఎల్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసును కూడా రివర్స్ పాలనలోనే నడిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయగలిగితేనే సామాజిక న్యాయం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మూడు ఫేక్ ఒప్పందాలు చేసుకుందని ఆరోపించిన డీఎల్... 3 కంపెనీలతో ఒప్పందాల కోసమే అయితే దావోస్ వెళ్లాల్సిన పని లేదన్నారు.