ఢిల్లీ చేరిన సీఎం జగన్... సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ
- గన్నవరం నుంచి బయలుదేరిన జగన్
- ఢిల్లీలోని అధికార నివాసంలో స్వల్ప బస
- అనంతరం మోదీతో భేటీ కానున్న జగన్
- రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపై చర్చ
- అమిత్ షాను కలిసే దిశగా జగన్ యత్నాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ నిమిత్తం గురువారం మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరిన జగన్...కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో తన అధికారిక నివాసం చేరుకోనున్న జగన్... సాయత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై మోదీతో జగన్ చర్చించనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే... మోదీతో భేటీ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. అయితే అమిత్ షాతో జగన్ భేటీకి సంబంధించి ఇప్పటిదాకా స్పష్టత లేదు. మోదీ అపాయింట్ మెంట్ దక్కినా...అమిత్ షా నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదని సమాచారం. అయితే అమిత్ షాతో జగన్ భేటీకి కూడా ప్రభుత్వ వర్గాలు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.