ప్రయాణికుల ప్రాణాలతో విస్తారా చెలగాటం.. రూ.10 లక్షల జరిమానా

  • కెప్టెన్ లేకుండా ఫస్ట్ ఆఫీసర్ తో ల్యాండింగ్
  • ఇండోర్ లో గుర్తించిన డీజీసీఏ
  • ప్రయాణికుల ప్రాణాలకు రిస్క్ గా పరిగణన
  • జరిమానా విధిస్తూ ఆదేశాలు
విస్తారా ఎయిర్ లైన్స్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చర్యలు తీసుకుంది. సరైన శిక్షణ లేకుండానే నేరుగా విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు ఫస్ట్ ఆఫీసర్లను (రెండో పైలట్) అనుమతిస్తున్నందుకు రూ.10 లక్షల జరిమానా విధించింది. 

సాధారణంగా ఫస్ట్ ఆఫీసర్లు పైలట్ కు సహాయకులుగా, ద్వితీయ పైలట్ గా వ్యవహరిస్తుంటారు. వారికి విమానాల ల్యాండింగ్, టేకాఫ్ పై సిమ్యులేటర్ ఫ్లయిట్లలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రయాణికులతో కూడిన విమానాల్లో డ్యూటీ అప్పగించాల్సి ఉంటుంది. 

పైలట్లకు కూడా ఇదే మాదిరి శిక్షణ ఉంటుంది. కానీ, ఒక విస్తారా విమానాన్ని కెప్టెన్ లేకుండా ఫస్ట్ ఆఫీసర్ ఇండోర్ లో ల్యాండ్ చేయడం, అతడికి సిమ్యులేటర్ లో శిక్షణ ఇవ్వలేదన్న విషయాన్ని డీజీసీఏ గుర్తించింది. దీనిని నిబంధనలను ఉల్లంఘించిన తీవ్రమైన చర్యగా డీజీసీఏ పరిగణించింది. ఇది విమానంలోని ప్రయాణికుల ప్రాణాలకు రిస్క్ గా భావించింది. దీంతో రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News