ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ ప్రజలు.. ఐదు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతల నమోదు!
- ఏపీలో మండిపోతున్న ఎండలు
- చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదు
- వచ్చే రెండు మూడు రోజుల్లోనూ ఇదే పరిస్థితి
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు నిన్న ఎండలు మండిపోయాయి. పడమర దిశగా వీస్తున్న గాలులకు ఉక్కపోత కూడా తోడవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో నిన్న చాలా చోట్ల 44 డిగ్రీలకు పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తునిలో అత్యధికంగా 43.5 డిగ్రీలు, గన్నవరంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.
వచ్చే రెండుమూడు రోజుల్లోనూ కోస్తాలో ఇదే పరిస్థితి ఉంటుందని, వడగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, కృష్ణా, ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.