రాజ్యసభ నామినేషన్ల స్క్రూటినీ పూర్తి... ఏపీ నుంచి ఆ నలుగురి ఎన్నిక లాంఛనమే!
- రాజ్యసభ ఎన్నికల్లో నామినేషన్ల స్క్రూటినీ పూర్తి
- 4 స్ధానాలకు బరిలో నలుగురు అభ్యర్థులు
- ఈ నెల 3న ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
- ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నుంచి కీలక ప్రకటన
రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగా... నామినేషన్ల గడువు కూడా ముగిసిపోయింది. తాజాగా బుధవారం సాయంత్రంతో నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఏపీలోని నాలుగు స్థానాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కాసేపటి క్రితం ఓ ప్రకటన చేసింది.
ఏపీ కోటాలోని 4 రాజ్యసభ స్థానాలకు 4 నామినేషన్లే వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే సమయంలో 4 నామినేషన్లు కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని కూడా ప్రకటించింది. నామినేషన్లు వేసిన వారిలో వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నదని, ఆ గడువు ముగిశాక వీటిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. 4 స్థానాలకు 4 నామినేషన్లే దాఖలైన నేపథ్యంలో వారి ఎన్నిక ఏకగ్రీవంగానే ముగియనుంది.