చంద్రబాబుతో దివ్యవాణి భేటీ... రాజీనామా ట్వీట్‌కు కారణం చెప్పిన నటి
- మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ
- తనను పార్టీ సస్పెండ్ చేసిందన్న వార్తలతోనే రాజీనామా ట్వీట్
- ఫేక్ ట్వీట్లతో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు చెప్పారన్న దివ్యవాణి
- తనకు రాజకీయం తెలియదన్న వారికి ధన్యవాదాలని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ పెట్టి, ఆ వెంటనే డిలీట్ చేసి, కలకలానికి కారణమైన ఆ పార్టీ మహిళా నేత, సినీ నటి దివ్యవాణి బుధవారం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిన ఆమె, తన రాజీనామాకు దారి తీసిన కారణాలను చంద్రబాబుకు వివరించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఓ ట్వీట్ కనిపించిన కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ పోస్ట్ చేశానని వెల్లడించారు. ఇదే విషయాన్ని తాను చంద్రబాబుకు చెబితే... ఫేక్ పోస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన తనకు సూచించారని తెలిపారు. తనపై విమర్శలు, విశ్లేషణలు చేసిన వారందరికీ కృతజ్ఞతలని, అలాగే తనకు రాజకీయం తెలియదంటూ వ్యాఖ్యానించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలంటూ ఆమె వ్యాఖ్యానించారు.