జులై 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ!
- ఇప్పటికే తేదీలను ప్రకటించిన జగన్
- నాగార్జున వర్సిటీ సమీపంలో ప్లీనరీ
- భారీగా నిర్వహించే దిశగా పార్టీ శ్రేణుల ఏర్పాట్లు
ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జులై 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీని నిర్వహించాలని ఇటీవలే ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేడుకలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్లీనరీ వేదికను ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు.
గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ప్లీనరీని నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడం, సీఎంగా జగన్ మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ఈ దఫా పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించే దిశగా పార్టీ కసరత్తులు మొదలుపెట్టింది.