హైద‌రాబాద్‌లో జెడ్ఎఫ్ అతి పెద్ద టెక్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

  • 2017లో హైద‌రాబాద్‌లో జెడ్ఎప్ సెంట‌ర్ ఏర్పాటు
  • దావోస్ స‌ద‌స్సులో త‌న కేంద్రం విస్త‌ర‌ణ‌కు సంస్థ అంగీకారం
  • రోజుల వ్య‌వ‌ధిలోనే విస్త‌ర‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంస్థ‌
  • ఈ కేంద్రంతో తెలంగాణ యువత‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాల‌న్న కేటీఆర్‌
ఐటీ దిగ్గ‌జం జెడ్ఎఫ్‌కు సంబంధించి ప్ర‌పంచంలోనే అతి పెద్ద టెక్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లో ఏర్పాటైంది. బుధ‌వారం తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ సెంట‌ర్‌ను ప్రారంభించారు. ఇటీవ‌లే ముగిసిన దావోస్ స‌ద‌స్సులో ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లోని త‌న టెక్ సెంట‌ర్‌ను విస్తరించే దిశ‌గా తెలంగాణ స‌ర్కారుతో జెడ్ఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

2017లోనే జెడ్ఎఫ్ సంస్థ త‌న కార్యాల‌యాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసింది. తాజాగా త‌న విస్త‌ర‌ణ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌గా, కేటీఆర్ దానిని ప్రారంభించారు. కొత్త‌గా అందుబాటులోకి వ‌చ్చిన విస్త‌ర‌ణ కేంద్రంతో జెడ్ఎఫ్‌కు సంబందించిన అతి పెద్ద టెక్ సెంట‌ర్ హైద‌రాబాద్‌లోనే ఏర్పాటైన‌ట్టయింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జెడ్ఎఫ్ విస్త‌ర‌ణ కేంద్రంతో తెలంగాణ యువ‌త‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని తెలిపారు.


More Telugu News