30 ఏళ్ల స‌మ‌స్య‌ను 3 ఏళ్ల‌లోనే ప‌రిష్కారించాలా?... గ‌డ‌ప‌గ‌డ‌ప‌కులో వైసీపీ ఎమ్మెల్యే అస‌హ‌నం

  • అల‌సంద‌గుత్తిలో ఆదోని ఎమ్మెల్యే ప‌ర్య‌ట‌న‌
  • మురుగు నీటి స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించిన ఎస్సీ కాల‌నీ వాసులు
  • 30 ఏళ్ల స‌మ‌స్య‌ను ఇప్పుడు అడుగుతారా? అంటూ సాయిప్ర‌సాద‌రెడ్డి ఆగ్ర‌హం
  • తాము అధికారంలోకి వ‌చ్చి 3 ఏళ్లే అయ్యిందంటూ వెళ్లిపోయిన వైనం
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఆయా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు ఎమ్మెల్యేల‌ను నిల‌దీస్తున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా కొన‌సాగుతున్న ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధవారం క‌ర్నూలు జిల్లా ఆదోని నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏళ్లుగా ప‌రిష్కారంగాని స‌మ‌స్య‌ను స్థానిక ఎమ్మెల్యే సాయిప్ర‌సాద‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ల‌గా ఆయ‌న ప్ర‌జ‌ల‌పై రుస‌రుస‌లాడారు.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... ఆదోని మండ‌ల ప‌రిధిలోని అల‌సంద‌గుత్తిలో ఎమ్మెల్యే సాయిప్ర‌సాద రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ కాల‌నీ వాసులు త‌మ ప్రాంతంలో ఏళ్ల త‌ర‌బ‌డి అప‌రిష్కృతంగా ఉన్న మురుగు నీటి స‌మ‌స్య‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్క‌సారిగా అస‌హ‌నం వ్య‌క్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే, 30 ఏళ్ల స‌మ‌స్య‌ను ఇప్పుడు అడుగుతారా? అంటూ మండిప‌డ్డారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వ‌చ్చి 3 ఏళ్లే అయ్యింద‌ని, త‌ర్వాత ప‌రిష్క‌రిస్తామ‌ని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


More Telugu News