బాక్సర్ నిఖత్ జరీన్‌కు కేసీఆర్ సర్కారు రూ.2 కోట్ల నజరానా... షూటర్ ఈషా సింగ్‌కు కూడా!
- 52 కిలోల విభాగంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్
- రూ.2 కోట్ల నగదు, ఇంటి స్థలాన్ని రివార్డుగా ప్రకటించిన కేసీఆర్
- షూటర్ ఈషా సింగ్‌కూ ఇదే తరహా ప్రోత్సాహకాన్ని ప్రకటించిన వైనం
- కిన్నెర మొగులయ్య ప్రోత్సాహకం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు
- బీఎన్‌రెడ్డి నగర్‌లో మొగులయ్యకు ఇంటి స్థలం
ఇటీవలే ముగిసిన బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో సత్తా చాటి 52 కిలోల విభాగంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు కేసీఆర్ సర్కారు భారీ నజరానాను ప్రకటించింది. రూ.2 కోట్ల నగదు పురస్కారంతో పాటుగా హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లుగా సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. నిఖత్‌తో పాటు షూటింగ్‌లో సత్తా చాటిన ఈషా సింగ్‌కు కూడా రూ.2 కోట్ల నగదుతో పాటు ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. కిన్నెర కళాకారుడు మొగులయ్యకు ప్రకటించిన నగదు ప్రోత్సాహకం నిధులు విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కిన్నెర వాయిద్యంతో పద్మశ్రీ అవార్డు గెలిచిన మొగులయ్యకు రూ.1 కోటి ప్రోత్సాహకంతో పాటు ఇంటి స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మేరకు తాజాగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.