నా గుండె బద్దలయింది: కేకే మరణంపై చిరంజీవి ఆవేదన
- లైవ్ పర్ఫామెన్స్ ఇస్తూ గుండెపోటుతో మృతి చెందిన కేకే
- కేకే మరణం షాక్ కు గురి చేసిందన్న చిరంజీవి
- చాలా త్వరగా వెళ్లిపోయారని ఆవేదన
ప్రముఖ సినీ గాయకుడు కేకే (కృష్ణ కుమార్ కున్నత్) మృతి దేశ వ్యాప్తంగా అందరినీ కలచి వేస్తోంది. కోల్ కతాలో లైవ్ పర్ఫామెన్స్ ఇస్తూ గుండెపోటుతో ఆయన స్టేజ్ పైనే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
కేకే మరణం తనను షాక్ కు గురి చేసిందని, తన హృదయం బద్దలయిందని చిరంజీవి అన్నారు. చాలా త్వరగా ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేకే ఒక అద్భుతమైన సింగర్, ఒక మంచి వ్యక్తి అని చెప్పారు. తన 'ఇంద్ర' సినిమాలో 'దాయి దాయి దామ్మ' పాటను పాడారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. కేకే ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.