కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తుంటే... బీజేపీ సంబరాల్లో మునిగింది: రాహుల్ గాంధీ ఆరోపణ
- గడచిన ఐదు రోజుల్లో కశ్మీర్‌లో 18 మంది పౌరుల మృతి
- కుల్గామ్‌లో పాఠశాల ఉపాధ్యాయురాలిని చంపిన దుండగులు
- ఈ ఘటనను కోట్ చేస్తూ ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం
- ఇది సినిమా కాదు, నేటి కశ్మీర్ వాస్తవికత అంటూ దెప్పిపొడుపు
భద్రత కోసం ఆందోళన వ్యక్తం చేస్తూ కశ్మీరీ పండిట్లు 18 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా... కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ... మోదీజీ ఇది సినిమా కాదు, నేటి కశ్మీర్ వాస్తవికత అంటూ దెప్పి పొడిచారు.
గడచిన ఐదు రోజుల్లోనే కశ్మీర్‌లో 15 మంది సైనికులు, 18 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. కుల్గామ్‌లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలను గుర్తు చేస్తూ బుధవారం రాహుల్ గాంధీ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కశ్మీర్ పండిట్లు భద్రత లేక ఆందోళనలు చేస్తుంటే...బీజేపీ ప్రభుత్వం మోదీ పాలనా సంబరాల్లో మునిగిపోయిందని ఆయన ధ్వజమెత్తారు.