పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తేనే కేంద్రం నిధులు ఇస్తుంది: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
- పోలవరం ప్రాజెక్టును అందరూ ఏటీఎంగానే చూశారన్న సత్యకుమార్
- రివర్స్ టెండరింగ్ తో రాష్ట్ర ప్రభుత్వం సాధించిందేంటని ప్రశ్న
- రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారంటూ విమర్శలు
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మింగేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో చిన్నచిన్న రిపేర్లు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడే పరిస్థితి ఉందని అన్నారు. చెత్త తొలగించడానికి కూడా కేంద్ర నిధులు కావాలని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అందరూ ఏటీఎంగానే చూశారని విమర్శించారు. గతంలో పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారని... ఇంత వరకు తేల్చింది ఏమీ లేదని అన్నారు.
రివర్స్ టెండరింగ్ తో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమిటని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై జలవనరుల శాఖ మంత్రులు సరిగా దృష్టి సారించడం లేదని దుయ్యబట్టారు. మూడు రాజధానులు అని చెప్పుకుంటూ... రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని మండిపడ్డారు. ఏయూ భూములను వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.