వరుసగా రెండో రోజు నష్టపోయిన మార్కెట్లు

  • 185 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 61 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన నెస్లే ఇండియా షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ఆద్యంతం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. రష్యా చమురుపై ఐరోపా ఆంక్షలు, ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 55,381కి పడిపోయింది. నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 16,522 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.32%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.94%), కోటక్ బ్యాంక్ (0.90%), టాటా స్టీల్ (0.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.64%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-2.99%), టెక్ మహీంద్రా (-2.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.63%), సన్ ఫార్మా (-2.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.10%).


More Telugu News