ఇదో స‌రికొత్త పిరికిపంద చ‌ర్య‌!... సోనియా, రాహుల్‌ల‌కు ఈడీ నోటీసుల‌పై కాంగ్రెస్ స్పంద‌న‌!

  • మోదీకి పెంపుడు సంస్థ‌గా ఈడీ
  • రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే నోటీసులు
  • ఈడీ నోటీసుల‌ను త‌ప్పుబ‌ట్టిన ర‌ణ‌దీప్‌ సూర్జేవాలా
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీల‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని ఆ పార్టీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ నోటీసులు జారీ చేసింద‌ని ఆ పార్టీ ఆరోపించింది. ఈ మేర‌కు సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ స‌మ‌న్లు అందిన మ‌రుక్ష‌ణ‌మే పార్టీ ప్రధాన కార్యదర్శి ర‌ణ‌దీప్ సూర్జేవాలా స్పందించారు.

ప‌లు జాతీయ మీడియా సంస్థ‌ల‌తో మాట్లాడిన సూర్జేవాలా... సోనియా, రాహుల్ గాంధీల‌కు ఈడీ స‌మ‌న్లు అందడం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలోని పిరికిత‌నానికి నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. ఇదో స‌రికొత్త పిరికిపంద చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసుల‌ను ద‌ర్యాప్తు చేయాల్సిన ఈడీ.. ప్ర‌ధాని మోదీకి పెంపుడు సంస్థ‌గా మారిపోయింద‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.


More Telugu News