తల్లిదండ్రుల మాటలను పట్టించుకోని సిద్ధూ మూసేవాలా

  • తుపాకీ సంస్కృతి గురించి పాటలు రాయొద్దని తల్లిదండ్రుల సూచన
  • తల్లి గురించి రాస్తే ఎవరూ వినరని బదులిచ్చిన మూసేవాలా
  • ఈ విషయాన్ని వెల్లడించిన పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్
తుపాకీ సంస్కృతిపై పాటలు రాయొద్దురా.. అంటూ సిద్ధూ మూసేవాలాకు అతడి తల్లిదండ్రులు ఎన్ని సార్లు చెప్పినా అతడు పట్టించుకోలేదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పంజాబీ లెజెండరీ గాయకుడు గురుదాస్ మాన్ వెల్లడించారు. 

‘‘యువతకు నీవు ఆరాధకుడిగా మారితే నీకు మాదిరే వారు కూడా చేస్తారు’’ అంటూ మూసేవాలాకు అతడి తల్లిదండ్రులు చెప్పేవారని మాన్ తెలిపారు. ఇతర అంశాలపై పాటలు రాసి, ఆలపించొచ్చుగా అంటూ తల్లిదండ్రులు కోరినప్పుడు.. ‘‘నా తల్లి గురించి రాస్తే ఎవరూ వినరు’’ అని మూసేవాలా అనేవాడని మాన్ వెల్లడించారు. గత ఆదివారం గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ జరిపిన కాల్పుల్లో సిద్ధూ మూసేవాలా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 

‘‘ఎంతో బాధాకరం. లెజెండ్ ను నష్టపోయాం. నేను అతడి తల్లింద్రులను కలిశాను. వారి పరిస్థితి చూడలేకపోయాను. మా అందరి హృదయాలు బాధతో బరువెక్కాయి. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఇతర కళాకారులు సైతం తాము ఎక్కడ, ఎలా ప్రదర్శన ఇవ్వగలమని ఆలోచించడం మొదలు పెడతారు’’ అని మాన్ వివరించారు.


More Telugu News