వారిని 5, 6వ స్థానంలో పంపితే పరుగుల వరదే: గవాస్కర్ సూచన
- పాండ్యా, పంత్ భాగస్వామ్యం విధ్వంసకరమన్న గవాస్కర్
- వాళ్లిద్దర్నీ 5, 6వ స్థానాల్లో పంపితే మంచిదని సూచన
- ఆరు ఓవర్లలో 120 పరుగులు పిండుకుంటారని వ్యాఖ్య
- అందుకే వారిని ఆయా స్థానాల్లో పంపించాలన్న సన్నీ
ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ముగిసింది. ఇక జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచుల టీ20పైకి దృష్టి మళ్లింది. ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలు కానుంది. దీనికంటే ముందు భారత్ దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లతో పొట్టి క్రికెట్ ఆడనుంది. ఈ విడత టీ20కి హార్థిక్ పాండ్యా సైతం అందుబాటులోకి రావడం భారత్ కు అదనపు బలం కానుంది.
ఈ నేపథ్యంలో టీ20కి సంబంధించి టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ లను 5, 6వ స్థానాల్లో పంపితే భారత జట్టు చివరి ఆరు ఓవర్లలో 120 పరుగులు సునాయాసంగా చేస్తుందని గవాస్కర్ పేర్కొన్నారు.
14వ ఓవర్ నుంచి 20వ ఓవర్ వరకు వీరిద్దరిదీ విధ్వంసకర భాగస్వామ్యంగా గవాస్కర్ అంచనా వేశారు. ఎంతలేదన్నా 100-120 పరుగులను ఆరు ఓవర్లలో వారి నుంచి ఆశించొచ్చని చెప్పారు. కనుక వారు 5, 6వ స్థానాల్లో బ్యాటింగ్ చేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. హార్థిక్ పాండ్యా ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కు నాయకత్వం వహించి టైటిల్ గెలవడం తెలిసిందే. అంతేకాదు, తన వంతుగా 487 పరుగులు సాధించి పెట్టాడు.