అఖిలేశ్ ను చూసి రాహుల్ గాంధీ అనుకోవడంలో పొరపాటేంలేదు: యోగి ఆదిత్యనాథ్ వ్యంగ్యం
- ఓ స్కూల్లో పరిశీలనకు వెళ్లిన అఖిలేశ్
- ఓ విద్యార్థి తనను రాహుల్ అనుకున్నాడన్న అఖిలేశ్
- ఆ విద్యార్థి కరెక్ట్ గానే చెప్పాడంటూ యోగి వ్యంగ్యం
- అఖిలేశ్ కు, రాహుల్ కు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యలు
తాను ఓ పాఠశాలను సందర్శించగా, తనను చూసి ఓ చిన్నారి రాహుల్ గాంధీ అనుకున్నాడని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ యూపీ అసెంబ్లీలో వెల్లడించడం తెలిసిందే. అయితే, ఈ అంశంలో అఖిలేశ్ కు సీఎం యోగి ఆదిత్యనాథ్ చురక అంటించారు. అఖిలేశ్ ను చూసి రాహుల్ గాంధీ అనుకోవడంలో పారపాటేమీ లేదని అన్నారు. ఆ విద్యార్థి కొంచెం ఆలోచించి సరిగ్గానే జవాబు చెప్పాడని అనుకుంటున్నానని తెలిపారు.
అఖిలేశ్ యాదవ్ కు, రాహుల్ గాంధీకి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదని అన్నారు. వీరిలో ఒకరు విదేశాలకు వెళ్లి సొంత దేశాన్ని విమర్శిస్తుంటారని, మరొకరు ఇతర రాష్ట్రాలకు వెళ్లి సొంత రాష్ట్రంపై విమర్శలు గుప్పిస్తుంటారని వివరణ ఇచ్చారు. ఆ విద్యార్థి అన్నదాంట్లో తప్పేమీ లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.