వారసత్వం ఒక్కటే పరమావధి కాదు... లోకేశ్‌కు పార్టీ పగ్గాలపై చంద్రబాబు వ్యాఖ్య
- కష్టించి పనిచేస్తేనే అవకాశమన్న చంద్రబాబు
- లోకేశ్‌తో పాటు పార్టీలోని ప్రతి ఒక్కరికీ అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు
- తరాలు మారుతున్న కొద్దీ సామర్థ్యం తగ్గుతోందని కామెంట్
- ఎన్నికల సమయంలోనే పొత్తులుంటాయని వెల్లడి
- ప్రజల మద్దతు ఉన్న పార్టీలదే విజయమన్న చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ భావి అధినేతగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ప్రోజెక్ట్ చేస్తున్న వైనంపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ది ప్రింట్ కరస్పాండెంట్ రిషిక సదమ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చే విషయంతో పాటుగా భావి తరాల నేతల సత్తాపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
వారసత్వం ఒక్కటే పరమావధి కాదని పేర్కొన్న చంద్రబాబు... కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వాళ్లకే అవకాశం దక్కుతుందని తేల్చి చెప్పారు. అలా పార్టీ పగ్గాలు స్వీకరించే అవకాశం లోకేశ్‌తో పాటు పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో తరాలు మారుతున్న కొద్దీ నేతల్లో సత్తా తగ్గిపోతోందని కూడా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తరంలో ఎక్కువ మందిలో సత్తా ఉంటే... తర్వాతి తరంలో సత్తా కలిగిన నేతలు తగ్గిపోయారని, ఆ తర్వాతి తరంలో అది మరింతగా తగ్గిపోతోందని చంద్రబాబు పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకునే దిశగా టీడీపీ పోరాటం చేస్తోందన్న చంద్రబాబు... ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతున్నామని చెప్పారు. ఈ దిశగా పొత్తులపై స్పందించిన చంద్రబాబు... పొత్తు అనేది రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినప్పుడే సాధ్యపడుతుందని చెప్పారు. ఈ పొత్తులన్నీ కూడా ఎన్నికల ముందే ఏర్పడతాయని ఆయన చెప్పారు. ప్రజల మద్దతు ఉన్న పార్టీలదే విజయమని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు.