'వరల్డ్ క్లాస్'గా తిరుపతి రైల్వే స్టేషన్‌పై అభ్యంతరాలు!... కేంద్రం దృష్టికి తీసుకెళతానన్న ఎంపీ గురుమూర్తి!
- వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి స్టేషన్
- ఇప్పటికే టెండర్లు ఖరారు కాగా త్వరలోనే పనులు ప్రారంభం
- కొత్త డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలు
- రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళతానన్న తిరుపతి ఎంపీ
తిరుపతి రైల్వే స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే డిజైన్లు పూర్తి కాగా ఆయా నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి అయ్యాయని, త్వరలోనే పనులను మొదలుపెట్టనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లపై తిరుపతి వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారు స్థానిక ఎంపీ మద్దిల గురుమూర్తికి తమ అభ్యంతరాలను వెల్లడించారు కూడా. ఈ క్రమంలో రైల్వే మంత్రి ప్రకటనపై గురుమూర్తి స్పందించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్లపై తిరుపతి వాసుల అభ్యంతరాలను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గురుమూర్తి ట్విట్టర్ వేదికగా తెలిపారు.