ప్రధానమంత్రి బీమా యోజ‌న పథకాల ప్రీమియంలు పెంపు!

  •  ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న ప్రీమియం ప్రస్తుతం ఏడాదికి రూ.12
  • దీనిని ఏడాదికి రూ.20లుగా పెంచిన ప్రభుత్వం 
  • ఇన్నాళ్లూ ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ప్రీమియం రూ.330 
  • తాజాగా దీనిని రూ.436కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం  
నామ‌మాత్ర‌పు ప్రీమియంతోనే దేశ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షా బీమా యోజ‌న ప్రీమియంను కేంద్ర ప్ర‌భుత్వం పెంచింది. ప్ర‌స్తుతం ఈ బీమా కోసం ఏడాదికి కేవలం రూ.12 వ‌సూలు చేస్తుండ‌గా... ఇప్పుడు దానిని రూ.20కు పెంచుతూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. 18 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి ఈ ప‌థ‌కం కింద బీమాను క‌ల్పిస్తూ మోదీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 

బ్యాంకు ఖాతా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఈ ప‌థ‌కం వ‌ర్తించేలా కేంద్రం ఈ ప‌థ‌కానికి రూప క‌ల్ప‌న చేసింది. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణం కానీ, శాశ్వత వైకల్యం కానీ సంభ‌విస్తే దీని ద్వారా రూ.2 ల‌క్ష‌ల బీమా, పాక్షిక వైక‌ల్యానికి రూ.1 ల‌క్ష బీమా అందుతుంది. 

 ఇక ఇదే త‌రహాలో ఏడాదికి రూ.330 ప్రీమియంతో ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ప్రీమియాన్ని కూడా కేంద్రం పెంచింది. ఈ ప్రీమియాన్ని రూ.436కు పెంచుతున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది.  


More Telugu News