అమెరికా అధ్యక్షుడి వార్నింగ్ ను పట్టించుకోని చైనా!

  • తైవాన్ ఆక్రమణకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించిన బైడెన్
  • తైవాన్ పరిసర ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను పెంచిన చైనా
  • చైనా చర్యల పట్ల దీటుగానే స్పందించిన తైవాన్
తైవాన్ ఆక్రమణకు పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఇటీవల చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, బైడెన్ వార్నింగ్ ను చైనా బేఖాతరు చేసింది. అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన కొన్ని రోజులకే తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. 30 యుద్ధ విమానాలను పంపింది. చైనా కవ్వింపు చర్యలకు తైవాన్ కూడా దీటుగానే స్పందిస్తూ.. తాను కూడా యుద్ధ విమానాలను మోహరింపజేసింది. మరోవైపు తన చర్యలను చైనా సమర్థించుకుంది. సైనిక శిక్షణలో భాగంగానే వైమానిక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపింది.


More Telugu News