2 ఇయర్స్ టు బైబై జగన్!... ఇదే ఇప్పుడు టీడీపీ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్!
- ట్విట్టర్ వేదికగా కొత్త ప్రచారం మొదలెట్టిన అయ్యన్న
- జగన్ మోసపు వాగ్దానాలు, వైఫల్యాలే లక్ష్యంగా వరుస ట్వీట్లు
- మరో ఇద్దరు టీడీపీ నేతలను నామినేట్ చేస్తూ సాగుతున్న ట్వీట్లు
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పదవీ కాలాన్ని ముగించుకున్న సందర్భాన్ని వైసీపీ శ్రేణులు సంబరంగా జరుపుకుంటూ ఉంటే... విపక్ష టీడీపీ మాత్రం 2 ఇయర్స్ టు బైబై జగన్ పేరిట ఓ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్ వేదికగా ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం మొదలుపెట్టిన ఈ ట్రెండ్‌కు ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ల నుంచి ట్వీట్లు పోస్ట్ అయ్యాయి.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు, సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఆయా అంశాలపై ఆయన చేసిన ప్రకటనలు అమలుకు నోచుకోకుండా ఉన్న వైనాన్ని ప్రశ్నిస్తూ వాటికి జగన్ ఇచ్చిన మోసపు వాగ్దానాలు ఇవి అని టీడీపీ నేతలు వరుసబెట్టి పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
అంతేకాకుండా జగన్ జమానాలోని మూడు వైఫల్యాల గురించి చెప్పాలంటూ ట్వీట్ చేసిన నేత.. మరో ఇద్దరు నేతలను నామినేట్ చేస్తున్నారు. జగన్ మోసపు వాగ్దానాలు ఇవి అంటూ పేర్కొన్న అయ్యన్న.. జగన్ 3 వైఫల్యాలను చెప్పాలంటూ టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అమర్‌నాథ్ రెడ్డిలను నామినేట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతల కొత్త ప్రచారం జోరుగా సాగుతోంది.