ముగిసిన ఐపీఎల్ సంరంభం... జూన్ 5న ఢిల్లీలో కలుసుకోనున్న టీమిండియా ఆటగాళ్లు

  • జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్
  • ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనున్న టీమిండియా
  • జూన్ 2న భారత్ వస్తున్న సఫారీలు
  • బయోబబుల్ ఎత్తివేత
  • పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అనుమతి
దేశంలో ఐపీఎల్ కోలాహలం ముగిసింది. ఇక టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్ లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. టీమిండియా జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం సఫారీలు జూన్ 2న భారత్ రానున్నారు. ఐపీఎల్ ఆడి అలసిపోయిన టీమిండియా ఆటగాళ్లు కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకుని జూన్ 5న ఢిల్లీలో కలుసుకోనున్నారు. వారు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కి సన్నద్ధమవుతారు.

కాగా, రెండేళ్ల తర్వాత ఈ సిరీస్ తో బయో బబుల్ విధానం ఎత్తివేస్తున్నారు. అంతేకాదు, మైదానాల్లోకి పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించనున్నారు. అయితే ఆటగాళ్లకు మాత్రం క్రమం తప్పకుండా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

టీమిండియా-దక్షిణాఫ్రికా సిరీస్ షెడ్యూల్...

తొలి టీ20 మ్యాచ్- జూన్ 9 (అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ)
రెండో టీ20 మ్యాచ్- జూన్ 12 (బారాబతి స్టేడియం, కటక్)
మూడో టీ20 మ్యాచ్- జూన్ 14 (ఏసీఏ-వీడీసీఏ స్టేడియం, వైజాగ్)
నాలుగో టీ20 మ్యాచ్- జూన్ 17 (ఎస్ సీఏ స్టేడియం, రాజ్ కోట్)
ఐదో టీ20 మ్యాచ్- జూన్ 19 (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)


More Telugu News