'వరల్డ్ క్లాస్'గా తిరుపతి రైల్వే స్టేషన్!... ఇలా ఉండబోతోంది!
- వెంకన్న భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ కిటకిట
- ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని వైనం
- తాజాగా వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్న వైనం
- డిజైన్లను విడుదల చేసిన రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న తిరుపతిలోని రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగానే ఉంటుంది. దేశ, విదేశాల నుంచి వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. అయితే ఆ రద్దీకి తగ్గట్టుగా రైల్వే స్టేషన్‌లో ఇప్పటిదాకా పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలా మాత్రం కనిపించదు. ఓ 20 ఏళ్ల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్ ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే ఉంది. అయితే ఇంకొన్నాళ్లు గడిస్తే మాత్రం తిరుపతి రైల్వే స్టేషన్ గుర్తించలేనంతగా మారిపోనుంది. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్ మారిపోబోతోంది.
తిరుపతి వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తి కాగా... ఆయా పనులను వేర్వేరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. పనులు కూడా శరవేగంగా జరగనున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వరల్డ్ క్లాస్ తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ల ఫొటోలను ట్విట్టర్‌లో విడుదల చేశారు. అంతేకాకుండా టెండర్లన్నీ పూర్తయ్యాయని, త్వరలోనే పనులు మొదలు కానున్నాయని తెలిపారు.