పీఎం కిసాన్ 11వ విడత నిధులు విడుదల చేసిన కేంద్రం
- 10 కోట్ల మందికి పైగా రైతులకు లబ్ది
- రూ.21 వేల కోట్ల విడుదల
- సిమ్లాలో ఓ కార్యక్రమంలో నిధులు విడుదల చేసిన మోదీ
- ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేల చొప్పున జమ
రైతులకు లబ్ది చేకూర్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా నేడు 11వ విడత నిధులను విడుదల చేసింది. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులను జమ చేశారు. 10 కోట్లకు పైగా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.21 వేల కోట్లను విడుదల చేశారు. కేంద్రం ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.6 వేలు అందిస్తోంది. విడతకు రూ.2 వేలు చొప్పున విడుదల చేస్తోంది.