కోడిగుడ్డు గుండెకు మంచిదేనంటున్న నిపుణులు!
- మోస్తరుగా తినే వారికే మంచి ఫలితాలు
- అధిక పరిమాణంలో రక్తంలో అపోలిపో ప్రొటీన్ ఏ1
- ఇది హెచ్ డీఎల్ కు కీలకం
- తక్కువ తినే వారిలో గుండె జబ్బుల రిస్క్
కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ దండిగా ఉంటుంది. అలాగే, ఇతర పోషకాలు కూడా తగినన్ని లభిస్తాయి. మరి కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కోడి గుడ్డు తినడం మంచిదేనా..? లేక హానికరమా..? దీనిపై భిన్న రకాల వాదనలు ఉన్నాయి. అంతేకాదు, భిన్న ఫలితాలతో కూడిన అధ్యయనాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి.
ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం అయితే గుడ్లను మోస్తరుగా తీసుకోవడం వల్ల గుండెకు మంచి చేసే మెటాబాలిటీలను పెంచుతుందని గుర్తించింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఈ లైఫ్’ అనే జర్నల్ లో ప్రచురించారు. దీనికంటే ముందు 2018 నాటి ఒక అధ్యయనం గురించి కూడా చెప్పుకోవాలి. నాడు చైనాలో 5 లక్షల మందిపై చేసిన అధ్యయనంలో రోజువారీగా గుడ్లు తినేవారికి, తినని వారితో పోలిస్తే గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. తాజా అధ్యయనం దీనికి కొనసాగింపు అని చెప్పుకోవాలి.
చైనాలో 4,778 మందిని ఎంపిక చేసి వారిపై తాజా అధ్యయనం నిర్వహించారు. అందులో 3,401 మందికి గుండె జబ్బులు ఉన్నాయి. మిగిలిన 1,377 మంది ఆరోగ్యవంతులు. వీరి ప్లాస్మా శాంపిల్స్ లో 225 మెటాబాలిటీలను అంచనా వేశారు. అందులో గుడ్లు తినడంతో సంబంధం ఉన్న 24 మెటాబాలిటీలను కూడా గుర్తించారు.
వ్యక్తులు ఎవరైతే మోస్తరుగా (మధ్యస్థంగా) గుడ్లను తీసుకుంటున్నారో.. వారి రక్తంలో అపోలిపో ప్రొటీన్ ఏ1 ఎక్కువ పరిమాణంలో ఉంటోంది. మంచి కొలెస్ట్రాల్ అని చెప్పుకునే హై డెన్సిటీ లిపో ప్రొటీన్ (హెచ్ డీఎల్) నిర్మాణానికి అపోలిపో ప్రొటీన్ ఏ1 కీలకం. దీన్నే మంచి లిపో ప్రొటీన్ అని కూడా చెబుతారు. కనుక మోస్తరుగా గుడ్లు తినే వారిలో హెచ్ డీఎల్ మాలిక్యూల్స్ మరింతగా ఉంటున్నాయి. ఇవి రక్తనాళాల్లో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను బయటకు పంపిస్తుంటాయి. దీంతో రక్తప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు.
గుండె జబ్బులకు దారితీసే 14 మెటాబాలిటీలను కూడా పరిశోధకులు గుర్తించారు. గుడ్లు తక్కువగా తినే వారిలో మంచిదైన అపోలిపో ప్రొటీన్ ఏ1 తక్కువగా ఉండడమే కాకుండా.. హానిచేసే మెటాబాలిటీలు ఎక్కువగా ఉంటున్నాయని గుర్తించారు.