ఢిల్లీలో గాలివాన బీభత్సం.. ఏపీ, తెలంగాణ భవన్ సహా నగరవ్యాప్తంగా కూలిన చెట్లు
- మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలో ఈదురు గాలులతో వర్షం
- నగరంలో స్తంభించిన ట్రాఫిక్
- చెట్లు విరిగిపడటంతో ధ్వంసమైన ఏపీ, తెలంగాణ భవన్ సిబ్బంది నివాసాలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి వాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం నగర వ్యాప్తంగా పెద్ద నష్టాన్నే మిగిల్చింది. గాలి వాన కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలపైనే చెట్లు విరిగిపడిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే... డిల్లీని అతలాకుతలం చేస్తున్న గాలి వాన... నగరంలోని ఏపీ, తెలంగాణ భవన్‌లోనూ బీభత్సం సృష్టించింది. గాలి వాన కారణంగా ఏపీ, తెలంగాణ భవన్ పరిధిలో ఉన్న భారీ వృక్షాలు కూలిపోయాయి. కూలిన చెట్లు సిబ్బంది నివాసాలపై పడ్డాయి. దీంతో సిబ్బంది నివాస భవనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. మరోవైపు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.