సిరా చల్లడానికి ముందు రాకేశ్ టికాయత్‌పై మీడియా మైక్‌తో దాడి... వీడియో ఇదిగో
- బెంగళూరులో టికాయత్ మీడియా సమావేశం
- ఆయనపై మీడియా మైక్‌తోనే దాడి చేసిన వ్యక్తి
- టికాయత్ భుజంపై గట్టిగా తగిలిన మీడియా మైక్
- దాడి తర్వాతే టికాయత్‌పై సిరా చల్లిన యువకుడు
భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌పై బెంగళూరులో కొందరు వ్యక్తులు సిరా చల్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరింత ఆసక్తి రేకెత్తించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. టికాయత్‌పై సిరా చల్లడానికి ముందు ఆయనపై ఏకంగా భౌతిక దాడి జరిగింది. మీడియా మైక్‌తో ఓ వ్యక్తి టికాయత్ భుజంపై గట్టిగా కొట్టాడు. దాడి చేసిన వ్యక్తిని పక్కకు తోసేసిన తర్వాత మరో వ్యక్తి వచ్చి టికాయత్‌పై సిరా చల్లాడు.
సోమవారం బెంగళూరు వచ్చిన టికాయత్ సంఘం స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీరి ఆహ్వానం మేరకు మీడియా ప్రతినిధులు కూడా అప్పటికే అక్కడకు చేరుకున్నారు. టికాయత్ మరికొందరు మీడియా సమావేశానికి సిద్ధమయ్యారు. అప్పటికే వారి ముందు ఉన్న చిన్న టేబుల్ మీద మీడియా ఛానెళ్లు తమ తమ మైకులను ఉంచాయి. మరికాసేపట్లోనే టికాయత్ మాట్లాడతారనగా ఆయనపై దాడి జరిగింది.
మీడియాతో మాట్లాడేందుకు టికాయత్ సిద్ధం కాగా... ఆయన ముందుకు దూసుకువచ్చిన ఓ వ్యక్తి టేబుల్‌పై ఉన్న మీడియా మైక్‌ను తీసుకుని టికాయత్‌పై దాడి చేశారు. అతడు విరిసిన మైక్ టికాయత్ భుజానికి తగిలింది. ఊహించని ఈ పరిణామంతో వెంటనే తేరుకున్న టికాయత్ అనుచరులు ఆ వ్యక్తిని పక్కకు తోసేశారు. ఈ క్రమంలోనే మరో యువకుడు వేదిక మీదకు వచ్చి టికాయత్‌పై సిరా చల్లాడు. ఆ తర్వాత టికాయత్, ఆయనపై దాడికి పాల్పడ్డ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.