చంద్రగిరి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
- రూ.37.69 లక్షల విద్యుత్ బకాయిలు
- చంద్రగిరి రెవెన్యూ,ఆర్ అండ్ బీ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
- 3 రోజులుగా చీకట్లోనే పాకాల సబ్ రిజిస్ట్రార్, ఆర్ అండ్ బీ కార్యాలయాలు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చంద్రగిరిలోని రెవెన్యూ, ఆర్ అండ్ బీ కార్యాలయాలకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను సోమవారం నిలిపివేశారు. చంద్రగిరి పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ శాఖకు రూ.37.69 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నాయట. ఈ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ ఆ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 3 రోజుల క్రితమే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతేకాకుండా పాకాలలోని ఆర్ అండ్ బీ కార్యాలయానికి కూడా 3 రోజుల క్రితమే విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఫలితంగా మూడు రోజులుగా ఈ రెండు కార్యాలయాలు విద్యుత్ సరఫరా లేకుండానే కొనసాగున్నాయి.