పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాపై 30 రౌండ్లు కాల్పులు జరిపి... ఊపిరి ఉందో లేదో చూసిన దుండగులు!
- పంజాబ్ లో ఘోరం
- కారులో వెళుతున్న గాయకుడిపై గుళ్ల వర్షం
- తీవ్రగాయాలతో మృతి చెందిన సిద్ధూ మూసేవాలా
- విషాదంలో అభిమానులు
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ యువ నేత సిద్ధూ మూసేవాలా నిన్న మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. వాహనంలో వెళుతున్న సిద్ధూ మూసేవాలాపై దుండగులు కాల్పులు జరిపారు. సిద్ధూ మూసేవాలాను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... సిద్ధూ మూసేవాలాపై దుండగులు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం, అతడు చనిపోయాడా? లేదా? అని నిర్ధారించుకుని అక్కడ్నించి నిష్క్రమించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలంలో దొరికిన బుల్లెట్ షెల్స్ పై ఏఎన్-94 అని ఉంది. దీన్నిబట్టి రష్యా తయారీ అస్సాల్ట్ రైఫిళ్లతో కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. అంతేకాదు, ఘటన స్థలి నుంచి పోలీసులు ఓ పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ హత్యకు తానే బాధ్యుడ్ని అంటూ కెనడాలో ఉండే భారతీయ సంతతి గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ చెప్పుకుంటున్నాడు. గోల్డీ బ్రార్ కరుడుగట్టిన గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ కి అనుచరుడిగా గుర్తింపు పొందాడు. లారెన్స్ బిష్ణోయ్ గతంలో ఢిల్లీ వర్సిటీ నేత. అయితే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి, ప్రస్తుతం ఓ కేసుకు సంబంధించి తీహార్ జైల్లో ఉన్నాడు.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యపై అంతర్జాతీయ ర్యాప్ సింగర్ డ్రేక్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. మూసేవాలా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ర్యాప్ అభిమానులు సిద్ధూ మూసేవాలా హత్యను ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ టుపాక్ మృతితో పోల్చుతున్నారు. టుపాక్ ను కూడా ఇలాగే కాల్చి చంపారు. విషాదకరమైన అంశం ఏమిటంటే... టుపాక్ మృతిపై సిద్ధూ మూసేవాలా 'ది లాస్ట్ రైడ్' అనే పాటను రూపొందించారు. ఇప్పుడు సిద్ధూ సైతం అదే రీతిలో మరణించడం అభిమానులను కలచివేస్తోంది.