తొడలు కొట్టించి, బూతులు తిట్టించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు: వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

  • సీబీఎన్ అంటే చంద్ర‌బూతుల నాయుడు
  • టీడీపీ అంటే తొడ‌ల దేహం పార్టీ
  • టీడీపీ ప్ర‌జాస్వామ్యబద్ధ పార్టీ కాద‌న్న సాయిరెడ్డి
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైకి చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌లను ఉసిగొల్పుతున్నార‌ని సాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు నేడు పార్టీ కార్యక‌ర్త‌ల‌ను ఉద్దేశించి సాయిరెడ్డి మాట్లాడుతూ...చంద్ర‌బాబుపైనా, టీడీపీపైనా, ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత‌ల‌పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

జ‌గ‌న్‌పైకి చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల చేత తొడ‌లు కొట్టిస్తున్నార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. అంతేకాకుండా జ‌గ‌న్‌ను బూతులు తిట్టిస్తూ చంద్ర‌బాబు శున‌కానందం పొందుతున్నార‌ని సాయిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ అంటే తొడ‌ల దేహం పార్టీ అని అభివ‌ర్ణించిన సాయిరెడ్డి.. సీబీఎన్ అంటే చంద్ర బూతుల నాయుడు అని అనుకోవాల్సి వ‌స్తోందంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడిని తాగుబోతుగా సాయిరెడ్డి అభివర్ణించారు. టీడీపీ ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా ఉన్న పార్టీ కాదని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్‌పై బూతులు తిట్టించడాన్ని టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబే నేర్పించార‌ని కూడా సాయిరెడ్డి ఆరోపించారు. ఈ చ‌ర్య‌ల ద్వారా చంద్ర‌బాబు ఓ బాధ్య‌త క‌లిగిన విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించడం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


More Telugu News