దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- నిన్న కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,070
- ఇదే సమయంలో 25 మంది మృతి
- దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17,698
మన దేశంలో కరోనా వ్యాప్తి నిలకడగా ఉంది. అనేక రాష్ట్రాల్లో కట్టడిలో ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,706 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,070 మంది కోలుకోగా... 25 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 17,698 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,31,55,749కి చేరుకుంది.
ఇక ఇప్పటి వరకు 4,26,13,440 మంది కరోనా నుంచి కోలుకోగా.... 5,24,611 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.04గా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.93,31,57,352 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 2,28,823 మంది టీకా వేయించుకున్నారు.