స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే..!
- పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్ పై 16 పైసల పెంపు
- హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.83
- లీటర్ డీజిల్ ధర రూ. 97.98
- విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.92
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ధరలు పెరుగుతున్న క్రమంలో... నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలపై వీటి ప్రభావం పడుతోంది. అయితే వారం క్రితం లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో జనాలు కొంత సంతోషించారు. కానీ ఇంతలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి.
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 17 పైసలు, డీజిల్ పై 16 పైసలు పెంచారు. దీంతో నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.83కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 97.98కి పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.92గా, డీజిల్ ధర రూ. 99.65గా ఉంది.