మరోసారి వక్రబుద్ధి చాటుకున్న అఫ్రిది... దీటుగా బదులిచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్
- భారత్ వ్యతిరేకిగా ముద్రపడిన అఫ్రిది
- ఇటీవల యాసిన్ మాలిక్ కు జైలుశిక్ష
- తప్పుడు అభియోగాలు మోపారన్న అఫ్రిది
- స్పందించిన అమిత్ మిశ్రా
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది భారత్ పై అనేక సందర్భాల్లో తన అక్కసు వెళ్లగక్కడం తెలిసిందే. ఇటీవల కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించగా, ఆ అంశంపైనా అఫ్రిది తనకు అలవాటైన రీతిలో స్పందించాడు. యాసిన్ మాలిక్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. అతడిపై తప్పుడు అభియోగాలు మోపారని అఫ్రిది ఆరోపించాడు. ఆ మేరకు ట్వీట్ చేశాడు.
అయితే, అఫ్రిదికి టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా దీటుగా బదులిచ్చాడు. నీ బర్త్ సర్టిఫికెట్ లాగా అన్నీ తప్పుదోవపట్టించేలా ఉంటాయని అనుకోవద్దు అంటూ అదిరిపోయే రేంజిలో చురక అంటించాడు. గతంలో అఫ్రిది క్రికెట్ సెలెక్షన్స్ కు తక్కువ వయసు చూపుతూ తప్పుడు జన్మదిన సర్టిఫికెట్ సమర్పించాడంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇది పాక్ క్రికెట్లో ఓ వివాదం అయ్యింది. దీనిపై ఇప్పటికీ భారత మాజీ క్రికెటర్లు అఫ్రిదిని ఏకిపారేస్తుంటారు. మరోసారి భారత్ విషయంలో వేలుపెట్టిన అఫ్రిది విమర్శలపాలయ్యాడు.